Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 8:33 pm Posted by : ramakrishna

కందర్ పల్లిలో కల్తీకల్లు తాండవం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కందర్ పల్లి గ్రామంలో పొద్దునే చాయ్ తాగినట్టుగా చాలా మంది. కల్లు తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్తీ కల్లు విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాట పడుతున్నారు కొంతమంది. వ్యాపారులు. కార్మికులు, కూలీల కడుపులు కొడుతూ అడ్డంగా సంపాదిస్తున్నారు. వింత మత్తును అలవాటు చేసి వారి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. ఒల్లు గుళ్ల చేసి ఆస్పత్రుల చుట్టూ తిప్పిస్తున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో కేసుల నుంచి తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా ఏ నాయకుడు పట్టించుకోడు. ఏ అధికారి తనిఖీలు నిర్వహించడు. కల్తీ కల్లు తాగి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ దాదాపు అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కల్తీ కల్లు జోరుగా నిర్వహిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బిచ్కుంద మండలంలో కందర్ పల్లి గ్రామంతో పాటు ఇతర గ్రామాలలో కూడా కల్తీ కల్లు జోరుగా కొనసాగుతుంది. కొన్ని గ్రామాలలో ఇతర గ్రామాల నుంచి సరఫరా చేస్తారు. దీంతో బిచ్కుంద మండలం అంతటా కల్తీకల్లు వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది.

 

Adulteration of opium in Kandarpalli

 

. . . వచ్చేది కొంత . . తయారయ్యేది కొండంత

వ్యాపారులు మత్తు కోసం ఇందులో రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. 10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు, మత్తు కోసం ఆల్ఫోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలు కలుపుతున్నారు. 5శాతం మేర మాత్రమే స్వచ్ఛమైన కల్లు విక్రాయిస్తున్నారు. మిగిలిన 95 శాతం కల్తీనే. అంతేకాకుండా అమ్మోనియం మిశ్రమ రసాయనాలు, సోడా యాష్, కుంకుడుకాయ రసం వాడుతున్నారు. దీనివల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కళ్లుపోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ప్రాణాలు సైతం పోతున్న ఘటనలు సంభవిస్తున్నాయి.

 

Adulteration of opium in Kandarpalli

 

. . . నిబంధనకు విరుద్ధంగా లైసెన్స్ : ఎక్సెజ్ శాఖ

నిబంధనల ప్రకారం కల్లుగీత కార్మికులకు లైసెన్స్ ఇవ్వాలి. కల్లు దుకాణం లైసెన్స్ దారులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. వారు ఈత చెట్ల ద్వారా తెచ్చే స్వచ్ఛమైన కల్లును విక్రయించాలి. కానీ వీరంతా ఓ గుత్తేదారుని ఎన్నుకొని, అతని వద్ద ఇంతో అంతా ఆ వ్యాపారికి మద్యం ప్రియులకు అవసరమైన కల్లు లేకపోవడంతో కల్తీకి అలవాటు చేస్తున్నారు.

 

Adulteration of opium in Kandarpalli

 

. . . కిక్కు కోసం మత్తు పదార్థాలు

కొందరు నిషేధిత డైజోఫామ్, ఆల్ఫాజోలం, క్లోరో హైడ్రెడ్, తదితర వంటి మత్తు పదార్థాలు కలుపుతూ ప్రజలకు కిక్కు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు తాగకపోయినా వారు పిచ్చి వట్టినట్లు వ్యవహరిస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంది.

. . . మత్తులో జోగుతున్న ఎక్సైజ్ శాఖ

బిచ్కుంద. మండలం కల్తీకల్లు ఎరులై పాడుతోంది. పట్టించుకునే నాధుడే లేకపోవడంతో కల్తీ కల్లు వాసన గుప్పుమాంటోంది. విచ్చలవిడిగా కల్లు దుకాణాలు పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగితేళు తున్నారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే కల్తీకల్లు ప్రాణాలు తీస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కల్లునుకల్తీ చేసి యాద్దేచ్చగా విక్రయాలు జరుపుతున్నా అబ్బేమ్ అదేం లేదంటున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, కల్తీ కల్లు సేవించి ఎంతోమంది అనారోగ్యానికి గురై మరణించిన పట్టించుకోవడం లేదు. మరోవైపు రాజకీయ పలుకుబడితో అధికారులు వారి జోలికి వెళ్లడం లేదు. దీంతో కల్తీకల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా గ్రామాలలో కల్తీకల్లు అమ్మకాలపై నిఘా పెట్టాలని పలువురూ గ్రామస్తులు కోరుతున్నారు.

 

Adulteration of opium in Kandarpalli