Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 8:27 pm Posted by : ramakrishna

అదిరిందయ్య చంద్రం…

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి అడవుల శాతాన్ని పెంచాలని ఒకపక్క కార్యచరణ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామములో నర్సరీలను ఏర్పాటు చేసి ఒక్కొక్క నర్సరీ లో 5000 నుంచి 8000 వరకు మొక్కలను పెంచి వర్షాకాలంలో నాటించాలని ప్రాణాలికలు సిద్ధం చేసుకుంటున్నారు. నర్సరీలలో డిసెంబర్ నెలలో విత్తనాలు నాటడం జరిగింది. అందరికంటే వినూత్నంగా ఆలోచించినా వ్యక్తి మోర్తాడ్ మండలంలోని షెట్ పల్లీ గ్రామంలో గల నర్సరీలో ఒకపక్క ఉల్లి పంట, కొత్తిమీర, మిరప చెట్లు వేయడం జరిగిందని పలువురు పేర్కొన్నారు. నర్సరీలో నాటిన మొక్కలు ఒకపక్క ఎండిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నర్సరీలో పెట్టిన ఉల్లి పంట, కొత్తిమీర, మిరప చెట్లు మాత్రం ఎండిపోకుండా ఏపుగా పెరగడం గమనార్ధంగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం వలన ఇలా జరుగుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

Adrindaya Chandra...