Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 7:15 pm Posted by : ramakrishna

సిఎంసి క్యాంపస్ లో నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎంఎల్టి కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం

 

డిచ్ పల్లి, బతుకమ్మ  : 

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సిఎంసి) క్యాంపస్ లో పారామెడికల్ కోర్సులకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు సిఎస్ఐ మెడికల్ బోర్డు కన్వీనర్ డాక్టర్. కే. దయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిఎంసి క్యాంపస్ లో నిర్వహిస్తున్న సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (జి ఎన్ ఎమ్), సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ (బిపిటి),  మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్టి) కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్ మెంట్ సౌకర్యం కలదని, పారామెడికల్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.ఆసక్తి గల విద్యార్థులు వివరాలకు ఫిజియోథెరపీ కోర్సు కోసం 9866790033, ఎంఎల్టి కోసం 9492002220, నర్సింగ్ కోసం 9948367416 నంబర్లను సంప్రదించాలని సూచించారు.