Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 8:54 am Posted by : ramakrishna

తెలంగాణలో జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల షెడ్యూల్ ను విడుదల చేశాయి. ఈమేరకు మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ గురువారం (మే 1) నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు మే చివరి వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియను జూన్‌ 30 వరకు   పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కళాశాలలు తమ వెబ్ సైట్ లలో, నోటీస్ బోర్డులలో పూర్తి వివరాలను అందుబాటులోనే ఉంచుతాయి. విద్యార్థులు  ఆయా కళాశాలల నిబంధనలు, అర్హత ప్రమాణాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.