Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:10 pm Posted by : ramakrishna

వర్షం నీటిలో ఆదిత్య పాఠశాల…

 

. . . వర్షానికి తేలిపోయిన సౌకర్యాలు

 

. . . తల్లిదండ్రుల ఆగ్రహం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని ఆదిత్య పాఠశాల ఆవరణలో గత రెండు రోజుల కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వర్షపు నీటి పారుదల కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను పూర్తిగా అనుమతి లేని వెంచర్లలో చివరికి ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

 

Aditya School submerged in rainwater...

 

అనుమతి ఎన్జీవోస్ కాలనీలో అయితే పాఠశాల నిర్వహణ సాయి కృప నాగర్ కాలనీలో కొనసాగడం పట్ల మండల జిల్లా విద్యాశాఖ అధికారులకు అటు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేయడం జరిగింది. పాఠశాల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండటంతో విద్యార్థుల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు పూర్తిగా వర్షాప్ నీటిలో మునిగిపోయి ఉండడంతో పిల్లలు నిరాశకు గురికాగా తప్పలేదు. అదేవిధంగా పాఠశాలలో నీరు నిల్వ ఉండడంతో దోమల వ్యాపించి సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే పాఠశాల యాజమాన్యం కూడా నీటి పారుదల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Aditya School submerged in rainwater...