స్థానిక ఎన్నికల్లో పోచారానికి తగిన బుద్ధి చెప్పాలి

 మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ ,బతుకమ్మ : రానున్న స్థానిక ఎన్నికల్లో పోచారానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బాన్సువాడ  పట్టణంలో మంగళవారం  బీఆర్ఎస్ ఆధ్వర్యలో విలేకరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకుని ఏ రోజు కూడా పాల్గొనని వ్యక్తి  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి...