Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2024, 7:02 pm Posted by : ramakrishna

స్థానిక ఎన్నికల్లో పోచారానికి తగిన బుద్ధి చెప్పాలి

 మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

బాన్సువాడ ,బతుకమ్మ : రానున్న స్థానిక ఎన్నికల్లో పోచారానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. బాన్సువాడ  పట్టణంలో మంగళవారం  బీఆర్ఎస్ ఆధ్వర్యలో విలేకరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు.  తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకుని ఏ రోజు కూడా పాల్గొనని వ్యక్తి  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం నుంచి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. ఆయనకు కెసిఆర్, ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రిగా, మరోసారి అత్యున్నతమైన శాసన సభాపతిగా పదవులు ఇచ్చారని తెలిపారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో భార స ప్రభుత్వం ఓడిపోయి ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కష్టకాలంలో ఉన్న భార స నేత కేసిఆర్ కు అండగా ఉండాల్సింది పోయి, ఆయనకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కసారి సహాయం చేస్తే చచ్చేంత వరకు ఆయన వెంట ఉండాల్సింది పోయి, నీ స్వార్థం కోసం, నీ అధికారం కోసం, మీ కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల కోసం బారస పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలంటూ బాజిరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు తిరగకుండానే, రాజకీయ భవిష్యత్తు కల్పించిన కెసిఆర్ కు అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్లో చేరిన పోచారం, నీతులు మానేసి రాజకీయ సన్యాసం తీసుకో అంటూ బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం చేసిన పనులు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా చేస్తుందని ఓటర్లు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 420 హామీలు ఎన్ని హామీలు నెరవేర్చావు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి 50% కూడా రుణమాఫీ చేయలేదంటూ బాజరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఏడాది పాలన గడిచిపోయినప్పటికీ ఇప్పటివరకు అన్నదాతలకు రైతు భరోసా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులకు 4000 పింఛను, కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు, తుల బంగారం ఏమైంది అని సీఎం రేవంత్ రెడ్డిని, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. యువతకు నిరుద్యోగ భృతి ఏమైంది? అంటూ ప్రశ్నించారు. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పట్ల ఏడాది కాలంలోనే ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని ఈ సందర్భంగా బడ్జెట్ గోవర్ధన్ వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన బారసకు 100 సీట్లకు పైగా సీట్లు సాధిస్తామని బాజరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు తేల్చుకుందాం అంటూ గోవర్ధన్ వెల్లడించారు. అనంతరం తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఆయన వెంట జుబేర్, గణేష్, పెద్ద ఎత్తున భార స కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.