రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఎరువులు, విత్తన పంపిణీ కేంద్రం ఆకస్మిక తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్ సెంటర్ ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్...