ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయండి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేయాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు సమస్యలపై జిల్లాలోని ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిపై చర్యలు చేపట్టాలని తెలిపారు. భూ సమస్యలు, రైతు భరోసా, పెన్షన్లు, ఇతర సమస్యలపై...