తిరుమలలో అన్నప్రసాదంలో అదనంగా ‘వడ’
వడ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల, బతుకమ్మ: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు...