అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రత్యేక పూజలు

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామానికి శ్రీరామ నవమి సందర్భంగా ఆర్మూర్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నెల్లి సరళ రాణి వారి కుటుంబ సభ్యులతో గోదావరి నది వద్దగల రామాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తడపాకల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,దేవాదాయ శాఖ,సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది, గ్రామ ప్రజలు, ఏర్గట్ల ఎస్సై రాము, ఏఎస్ఐ లక్ష్మణ్ నాయక్, పోలీస్ సిబ్బంది తిరుమలేష్,రఘు,హరి, పాల్గొన్నారు.