బతుకమ్మ, పిట్లం : కామారెడ్డి జిల్లా అడిషనల్ డిఆర్డిఓ,పిట్లం మండల ప్రత్యేక అధికారి వామన్ రావు గురువారం పిట్లం మండలంలోని గౌరారం,చిల్లర్గి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. అనంతరం చిల్లర్గి, నాగంపల్లి గ్రామాలలో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల ఉపాధి హామీ ఎపీఓ మహేష్,ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ లు హకీమ్,సతీష్,రవి,ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు వినోద్,లక్ష్మణ్,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు సలామ్,రామ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.