పోలీస్ ప్రజావాణిలో 25 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు డిసిపి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజా సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 25 ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్) శుభం ప్రకాష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటిని చట్టపరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు...