Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 9:26 pm Posted by : ramakrishna

పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను, కేజీబీవీ పాఠశాలను అడిషనల్ కలెక్టర్  అంకిత్ శుక్రవారం సందర్శించడం  జరిగింది. ప్రతి పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలలను, స్కూల్ పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. అలాగే భోజనం యొక్క మెనూను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో  తిరుమల, మండల విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి, ఎం జె పి టి బి సి డబ్ల్యూ ఆర్ ఎస్ ప్రిన్సిపల్ ప్రసాద్, కేజీబీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Additional Collector visited the school