ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్, బాల్కొండ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి భుజంగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్లందరూ తమకు అందజేసిన ఓటరు ధృవీకరణ ఫారాలను పూర్తిగా నింపి, వీలైనంత త్వరగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ లు) కు అందజేయాలని సూచించారు. ఏర్గట్ల మండలంలో ఇప్పటివరకు సుమారు 75 శాతం ఓటరు ఫారాలను బీఎల్ఓ...