Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2025, 1:29 pm Posted by : ramakrishna

నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్

బోధన్, బతుకమ్మ : బోధన్  పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో  పరిశీలించారు. పసుపు వాగు, జూనియర్ కాలేజ్ బావి, ఎస్‌కెఎన్‌ఆర్ బావి వద్ద నిమజ్జన స్థలాలను తనిఖీ చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి శానిటేషన్ వాహనాలను పరిశీలించారు. నిమజ్జనాల సందర్భంగా పట్టణంలో పరిశుభ్రతను కాపాడుతూ, అవసరమైన సౌకర్యాలు అందించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.

Additional Collector Ankit inspects the immersion arrangements