- ఎస్సై మహేష్
భీమ్ గల్, బతుకమ్మ : సమాజంలో యువత మత్తు పదార్థ ల జోలికి వెళ్తే వారి జీవితాలు సర్వ నాశనం అవుతాయని ఆ మత్తు నుండి బయిటికి రావడం కష్టతరమని ఎస్సై మహేష్ అన్నారు. శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ లో కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ ఇతర మాదాక ద్రవ్యాల సేవనం.. వాటి దుష్పరినామాల పై అవగాహన కార్యక్రమంను నిర్వహించి వాటి అవగాహన కల్పించడానికి ముద్రించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వాడకం వల్ల మానసిన స్థితి దెబ్బతిని, మతిస్థిమితం కోల్పోయిన ఉన్మాధులుగా తయారవుతారన్నారు. అలాంటి ఉన్మాదంలో వారు చేసే చెడు, మంచిని గుర్తించలేరని అన్నారు. దాంతో నేర ప్రవుత్తి అలవడి నేరస్థులుగా తయారు అవుతారన్నారు. తమ పిల్లలు ఈ మత్తు పదార్థాల బరిన పడకుండా తల్లిదండ్రులు భాద్యత వహించాలని అన్నారు.ఎవరైనా కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ అమ్మినట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 1908 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్. అజయ్ పవర్, ఆశ వర్కర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.