ఏర్గట్ల విద్యార్థిని వైష్ణవి కి రాష్ట్రస్థాయి పురస్కారం

ఏర్గట్ల, బతుకమ్మ : బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని జక్కని వైష్ణవి నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతి ని సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసే వేదికగా అకాడమీ పోటీలు నిర్వహిస్తోంది ఆని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో  జక్కని వైష్ణవి బహుమతులు పొందడం పాఠశాలకు గర్వకారణం అని తెలిపారు. చిన్నప్పటి...