సీఐడీ విచారణకు హాజరైన సినీ నటి మంచు లక్ష్మి

హైదరాబాద్, బతుకమ్మ :  బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో  సినీ నటి మంచు లక్ష్మి  సీఐడీ విచారణకు హాజరయ్యారు.  ఈ కేసులో ఇప్పటికే శ్రీముఖి, నిదీ అగర్వాల్, సన్నీ యాదవ్, అమృత చౌదరి, టేస్టీ తేజా, రానా, ప్రకాష్ రాజ్ లను విచారించి వారి నుంచి సీఐడీ స్టేట్మెంట్ తీసుకుంది.  వారి బ్యాంక్ లావాదేవీలపైనా సీఐడీ అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.