Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 12:00 pm Posted by : ramakrishna

ఈడీ విచారణకు హాజరైన నటుడు రానా

హైదరాబాద్, బతుకమ్మ :  నటుడు దగ్గుపాటి రానా సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై రానాను ఈడీ అధికారులు కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని రానాకు ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈనెల 13న మంచు లక్ష్మి ఈడీ విచారణకు  హాజరుకానుంది.