Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 6:57 pm Posted by : ramakrishna

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని తెదేపా రాష్ట్ర మాజీ కార్యదర్శి విట్టల్ అన్నారు. గురువారం బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో తెదేపా మెంబర్షిప్ కార్డులను కార్యకర్తలకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు విట్టల్, రవికుమార్, రామకృష్ణ, బాలాజీ, శ్రీనివాస్ రావు, బి.జి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.