Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 5:43 pm Posted by : ramakrishna

క్రియాశీల సభ్యత్వాన్ని పూర్తి చేయాలి

ఆర్మూర్, బతుకమ్మ : బిజెపి జిల్లా పార్టీ ఆదేశం మేరకు మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఆర్మూర్ మండల భారతీయ జనతా పార్టీ సంస్థ గత కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్  హాజరయ్యారు. ఈ  సందర్భంగా  ఆయన బూత్ అధ్యక్షులకు, మండల పాదాధికారులకు, శక్తీ కేంద్ర ఇంచార్జ్ లకు దిశ నిర్దేశం చేశారు. మండలం లో సభ్యత్వం లో క్రియశిలంగా పాల్గొని విజయవంతం చేయడం అభినందనియమని అన్నారు. అట్లాగే క్రియశిలా సభ్యత్వంన్ని కూడ పూర్తి చెయ్యాలని, ప్రతి బూత్ లో ముగ్గిరికి తగ్గకుండా క్రియ శిలా సభ్యత్వం చెయ్యాలని సూచించారు. సభ్యత్వం తొందరగా పూర్తి చెయ్యడానికి పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తల కొన్ని గ్రామాలను తీసుకొని పూర్తి చెయ్యాలని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం లో ముందు ఉండాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాయకత్వo సిద్ధం గా ఉండాలని, కార్యకర్తలను సమాయత్తం చెయ్యాలని కోరారు, ప్రతి బూత్ అధ్యక్షులు, శక్తికేంద్ర ఇంచార్జి, సీనియర్ నాయకులు, పార్టీ పదధికారులు 100కు మించకుండా సభ్యత్వం చేసే విధంగా చూసుకొని క్రియ శిల సభ్యత్వం న్ని తీసుకోవాలని కోరారు. ఈ సమావేశం లో బీజేపీ భద్రాచలం ఇంచార్జ్ అందపూర్ రాజేష్, మాజీ జడ్పిటిసి సందన్న,పార్టీ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, వినోద్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జిలు పాల్గొన్నారు.