. . . డీఎస్పీ విఠల్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మండలం తాడ్కోల్ తో పాటు పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను డీఎస్పీ విఠల్ రెడ్డి తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద నిషేధిత వస్తువులతో తిరగడం పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది ఏమాత్రం అజాగ్రత్త వహించరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.