అడవి జంతువుల, మానవుల రక్షణకు అటవి శాఖ చర్యలు 

నందిపేట్ (బతుకమ్మ): నందిపేట్ మండలం సిహెచ్ కొండూర్ అడవి ప్రాంతంలో పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో అడవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలో అడవి జంతువుల సహజ వాతావరణాన్ని కాపాడడంతో పాటు మానవుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. నందిపేట్ మండల ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ, పులి కదలికలను పర్యవేక్షించేందుకు అడవిలో అధునాతన కెమెరాలను గురువారం రోజున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాలు ఆటోమేటిక్‌గా జంతువుల కదలికలను చిత్రీకరించడంతో పాటు వాటి సంచారంపై విశ్లేషణ చేసేందుకు ఉపయోగపడతాయని ఆయన...