. . . అక్రమ తవ్వకాల పై ప్రత్యేక దృష్టి సారించాలి
. . . ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నల్ల మట్టి తవ్వకాల పేరిట చెరువు శిఖం భూముల కబ్జాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నల్ల మట్టి తరలింపు పేరుతో కొంతమంది దానిని దుర్వినియోగం చేస్తూ.. నల్లమట్టి తవ్వకాలు జరిపి చెరువు శిఖం భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారి సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖల అధికారుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయబడతాయన్నారు. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేయవద్దని అలా చేస్తే చట్టపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదని సూచించారు. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ,ఇరిగేషన్, మైనింగ్, పోలీసు, శాఖల అధికారులకు నిరంతర పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. సహజవనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.