పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, బతుకమ్మ : రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ లైన్ దాటితే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఆయన సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ, అభివద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.