Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2024, 9:38 pm Posted by : ramakrishna

తప్పుడు వార్తలను ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తప్పడు వార్తలను సృష్టించి సామాజిక మాధ్యమలాలో తప్పుడు ప్రచారం చేసిన సోషల్ మీడియా అకౌంట్ల పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీనాయకులు అభిలాష్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలోని ఒకటో టౌన్ లో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొండా సురేఖ తను చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకున్నకాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అదే తంతు గా ఫేక్ న్యూస్ సృష్టించి సామాజిక మాధ్యమలాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని అన్నారు. అలాంటి సోషల్ మీడియా అకౌంట్ల పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంజరి ప్రశాంత్, గంగాధర్, అమన్, జశ్వంత్, యువకులు పాల్గొన్నారు.

Action should be taken against those who spread fake news