. . . డీఎస్పీ, సీఐలకు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు
బాన్సువాడ, బతుకమ్మ :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటంపై అనుచిత స్టిక్కర్లు అతికించడం, రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని పేర్కొంటూ సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు శుక్రవారం బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, పట్టణ సీఐ తుల శ్రీధర్ లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అవమానకర ప్రచారం చేస్తూ, దేశ యువతను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు దేశంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నంగా భావిస్తున్నామని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనుచిత స్టిక్కర్లు, పోస్టర్లను ఏర్పాటు చేసిన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడుగుట్ల శ్రీనివాస్, అందే చిరంజీవి, వంకారు ఉమేష్, సచిన్ యాదవ్, చీకట్ల రాజు, సాయి రెడ్డి, పురుషోత్తం, భూమేష్, మహేందర్, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
