జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ కళాశాల ఎదుట ఉన్న రోడ్డు డివైడర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయటం జరిగింది. ఇట్టి విషయంలో విచారణ జరిపి కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా ప్రమాదాలు జరగకుండా వెంటనే కూల్చివేతకు గురైన డివైడర్ ను నిర్మించాలని జిల్లా కలెక్టర్, జిల్లా సుపరిండెంట్ ఆఫ్ పోలీస్ కు ఆదివారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఫిర్యాదు చేశారు.