పర్మిషన్ లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో పర్మిషన్ లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్ఎస్ వో, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం వారు మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య, బుడిమి x రోడ్ లో నారాయణ పాఠశాలలపేరుతో ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని విద్యార్థి సంఘాల...