బస్టాండ్ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో గల బస్టాండ్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని, ఈ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోమవారం జవహర్ నగర్ కాలనీవాసులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యుటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గంగాధర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జేయన్సీ బస్టాండ్ ను 2005 వ సంవత్సరంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ బస్టాండ్ శిథిలావస్థలో ఉంది. దీనిని అదునుగా...