నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

  . . . బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ వెల్లడి   ముప్కాల్, బతుకమ్మ :   2024-25 సంవత్సరంలో ఎం.జి.ఎన్.ఆర్.జి.ఎస్ నిధుల కింద 75 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, ఆ నిధుల దుర్వినియోగం అయినట్లు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 కిలోమీటర్ల డ్రైనేజీ ఉందని చూయించి నిర్మాణం పనులను చేపట్టకుండానే సుమారు నాలుగు లక్షల రూపాయల నిధులను ఎం.బి రికార్డు చేసి అధికారులకు చూపించి తప్పుదోవ పట్టించారని...