- విద్యార్ధి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్
బాల్కొం, బతుకమ్మ : అక్రమంగా ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో కొత్తగా స్కూల్ ఏలాంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా స్కూలు పరిధిలోని పాండురంగ స్టోర్ ఉండడం, పెట్రోల్ పెట్రోల్ బంకు 100మిటర్ దూరం కూడా లేదు ఇలా విద్యార్థుల ప్రాణాలతో చేలగాటంమాడుతున్న భాష్యం స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ స్కూల్ బయట నిరసన తెలిపారు. ఈ విషయంపై సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాస్పద విషయమని అన్నారు. విద్యాశాఖ అధికారి ఇప్పటికైనా కళ్ళు తెరిచి భాష్యం స్కూల్ యజమానులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో సేన నాయకులు వికాస్.సతీష్, ప్రణయ్ పాల్గొన్నారు.