ఎస్సీ భవనంపై జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ:   పిట్లం మండలం లోని బుర్నాపూర్ గ్రామంలో ఉన్న ఎస్సీ భవనంపై జరుగుతున్న ఆక్రమణ చర్యలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత రాష్ట్ర, జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పిట్లం మండలంలోని బుర్నాపూర్ గ్రామంలోని ఎస్సీ కమిటీ భవనం 1989 సంవత్సరంలో షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సి సమాజం కోసం మాత్రమే నిర్మించి అధికారికంగా అప్పగించినదని తెలిపారు. ఈ భవనం ఎస్సి కమిటీ దేనని స్పష్టం చేసేలా...