హోటల్ మేనేజ్మెంట్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో నిబంధనలు పాటించని హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు కనీసం కాలేజీలను తరచుగా తనిఖీలు చేయకపోవడం బాధాకరమన్నారు. కొన్ని ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు జాతీయ హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ టెక్నాలజీ కౌన్సిల్ లేదా రాష్ట్ర సాంకేతిక...