రిపోర్టర్ పై దూర్భాషలాడిన డిఎస్పి పై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, బతుకమ్మ : రిపోర్టర్ పై పరుష పదజాలం వాడిన కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వర్ రావుపై జిల్లా అడిషనల్ ఎస్పీకి టీఎస్ జేయూ, ఎన్యూజే(ఐ) సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ మండల రిపోర్టర్ గా పనిచేస్తున్న మొహమ్మద్ రఫిక్ ఓ కేసు విషయంలో కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు దగ్గరికి వెళ్లాడు. తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో నువ్వు ఎవరైతే నాకేంటి రా.. అంటూ ఇతర అసభ్య పదజాలంతో దూషించారు. ఒక జర్నలిస్టు పట్ల డిఎస్పీ తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం...