Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 5:42 pm Posted by : ramakrishna

చీఫ్ జస్టీస్ పై దాడికి పాల్పడ్డ నిందితుడిపై చర్యలు తీసుకోవాలి

  • ఎంఆర్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

 

ఢిల్లీ, బతుకమ్మ : చీఫ్ జస్టీస్ పైన దాడికి పాల్పడ్డ నిందితుడిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని ఎంఆర్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్  ఆద్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ అధినేత, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు, న్యాయవ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డా. మున్నంగి నాగరాజు మాదిగ, నరేంద్ర బాబు కడర్ల నవీన్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నగరేష్ మాదిగ, వివిధ రాష్ట్రాల ఎంఆర్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Action should be taken against the accused who attacked the Chief Justice.