Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 6:45 pm Posted by : ramakrishna

తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలి

  • బోధన్ పట్టణ తెలంగాణ జాగృతి యువజన విభాగం నాయకులు అల్లాడి దేవా

 

రుద్రూర్, బతుకమ్మ: జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న (అలియాస్ చింతపండు నవీన్) అసభ్యకరంగా అనుచిత వాక్యాలు చేయడం సిగ్గుచేటని, తీన్మార్ మల్లన్న పై వెంటనే చట్టపర చర్యలు తీసుకోవాలని బోధన్ పట్టణ తెలంగాణ జాగృతి యువజన విభాగం నాయకులు అల్లాడి దేవా తీవ్రంగా ఖండించారు. తీన్మార్ మల్లన్న వైఖరిని మార్చుకోవాలని, మరోసారి ఎమ్మెల్సీ కవితపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.