నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న స్కూళ్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓకు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరం లో సుమారు 15 స్కూల్స్ ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న మండల విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 15 అనుమతులు లేని స్కూళ్ల వివరాలను డీఈఓకు అందజేశామని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం అవ్వకముందు నుంచే అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించి స్కూల్ లకు ఇబ్బందుల పాలు గురిచేస్తున్న ఈ కార్పొరేట్ ఆగడాలను అరికట్టాల్సిందిగా కోరామని తెలిపారు.