అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో అనుమతులు లేని పాఠశాలలు అడ్మిషన్లు తీసుకుంటున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్  రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం అన్నారు. సోమవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జి డిప్యూటీ తహశీల్దార్ నవీన్కు ఏఐఎస్ఎఫ్, ఎల్ఎస్వో, ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్ఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జివన్, ఎస్ఎఫ్ఐ జిల్లా...