Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 4:08 pm Posted by : ramakrishna

కేజీబీవీ టీచర్ పై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బంగారు గొలుసు దొంగతనం నెపంతో దళిత విద్యార్థిని సహస్రను మంత్రగాడి వద్దకు తీసుకెళ్లిన మాక్లూర్ కేజీబీవీ టీచర్ గౌతమిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాగజ్యోతికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంచాల్సిన టీచర్లే, ఇలా మూఢనమ్మకాలను ఆశ్రయించడం, పిల్లలను వేధించడం తగదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఆర్టీ గౌతమిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.  చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు చేస్తామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీడీఎస్ యూ నాయకులు రమేశ్, సతీశ్, సాయి తదితరులున్నారు.