Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 9:20 pm Posted by : ramakrishna

అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపడుతున్న విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలి

 

. . . డిఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జీవన్ రాథోడ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి లేకపోయినా బోధన్ లో ఉన్నటువంటి విజయసాయి పేరు మీద బాన్సువాడ పట్టణంలో విజయసాయి పేరుతో బ్రాంచ్ పెట్టి అడ్మిషన్లు నిర్వహిస్తున్న విజయ్ సాయి విద్యాసంస్థల యజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ అన్నారు. డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ లోని బోధన్ పట్టణంలో గల విజయసాయి జూనియర్ కాలేజ్ పేరు తో బాన్సువాడ పట్టణంలోని రెండో బ్రాంచ్ గతంలో బుడిమిరోడ్లో గల ఠాగూర్ జూనియర్ కాలేజీ బిల్డింగ్ లో విజయ్ సాయి జూనియర్ కాలేజ్ పేరుతోటి అడ్మిషన్ నిర్వహిస్తూ విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విజయ్ సాయి జూనియర్ కాలేజ్ యజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కి వెళ్లి జిల్లా నోడల్ ఆఫీసర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ బాన్సువాడ డివిజన్ కార్యదర్శి నహీం, సహాయ కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు.