Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 8:54 pm Posted by : ramakrishna

అమీషాపై చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ : నాగరెడ్డిపేట : పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రి అమీషాపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాగిరెడ్డిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది.ప్రపంచ దేశాలు అంబేద్కర్ను దేవుడిగా కొలుస్తున్నటువంటి ఈరోజుల్లో ఒక కేంద్రమంత్రి పదవిలో ఉండి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి అమీషా 24 గంటల్లో అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలని లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అంతం అయ్యేవరకు తాము నిరసన చేపడతామని అన్నారు.ప్రతి గ్రామ గ్రామము నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని లేవనెత్తే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనన్నారు.బిజెపి అంబేద్కర్ దేవుడని ఒక వైపు కొలుస్తా ఉంటే కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.అమీషా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసనను తెలిపారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మిద్దె బాబురావు, మాజీ జెడ్పిటిసి జయరాజ్, రిటైర్డ్ ఎంఈఓ పోచయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు కుంటొల్ల యాదయ్య,అంబేద్కర్ సంఘ నాయకులు బాబురావు, రాజు, ఠాగూర్, బలరాం, శ్రీను, దాసరి సాయిలు, కుంటోళ్ల శ్రీను, మైనుద్దీన్,ఇతర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.