ఆల్ఫోర్స్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి : టీజీవీపీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఆల్ఫోర్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని టీజివీపి ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్మీడియట్ జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ  సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ  2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆల్ఫోర్స్ ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా విద్యాసంస్థను నడిపించారన్నారు. ఇది ప్రభుత్వ విద్యా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైన చర్య,ఇలా అక్రమంగా కాలేజీ నడపడం వల్ల విద్యార్థుల చదువు,...