Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 5:36 pm Posted by : ramakrishna

ఆల్ఫోర్స్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి : టీజీవీపీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  అనుమతులు లేకుండా నడిపిస్తున్న ఆల్ఫోర్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని టీజివీపి ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్మీడియట్ జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ  సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ  2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆల్ఫోర్స్ ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా విద్యాసంస్థను నడిపించారన్నారు. ఇది ప్రభుత్వ విద్యా నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైన చర్య,ఇలా అక్రమంగా కాలేజీ నడపడం వల్ల విద్యార్థుల చదువు, వారి అర్హతలు, భవిష్యత్‌ పట్ల పెద్ద ప్రమాదం ఏర్పడుతోంది అన్నారు.  అదేవిధంగా నియమనిబంధనలు, అధికారులు అని లెక్కచేయకుండా 2025 -26 అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యా సంవత్సరం గాని ముందస్తు చర్యగా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా చూడడం అనేది అత్యంత అవసరం అన్నారు. ఇటువంటి అక్రమ కాలేజీలపై తక్షణమే నిఘా పెట్టి విద్యావ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యకరమం లో కార్యకర్తలు మహేష్, సుజిత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.