ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలపై చర్యలు తీసుకోవాలి
. . . కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కామారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రైతులు, గిరిజనులు, గ్రామ పంచాయతీలు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర సమస్యల పరిష్కారం కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గురువారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 268, మల్తుమ్మెద...