Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 5:20 pm Posted by : ramakrishna

హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్ పై చర్యలు తీసుకోవాలి

 

. . . హిందూ సంఘాల ఆధ్వర్యంలో రెంజర్ల రాజేష్ దిష్టిబొమ్మ దహనం

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హిందువులను కించపరిచేలా అసభ్య పదజాలంతో మాట్లాడిన రెంజర్ల రాజేష్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూ సమాజాన్ని అవమానించేలా మాట్లాడిన రాజేష్ పై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు గుండూరు ప్రశాంత్ గౌడ్, కుమ్మరి గణేష్, అడప నవీన్, తాటిపాముల హరీష్, పత్తి నవీన్, గణేష్, సంతోష్, యువరాజ్ అప్ప తదితరులు పాల్గొన్నారు.

 

Action must be taken against Renjarla Rajesh for making inappropriate comments about Hindus.