వెల్నెస్ హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొన్న ఏసీపీ వెంకట్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న వెల్నెస్ హాస్పిటల్స్ క్రికెట్ లీగ్ లో ఏసీపీ వెంకట్ రెడ్డి పాల్గొని టాస్ వేసి అనంతరం మ్యాచ్ వీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవితం లో క్రీడలు ఒక భాగంగా అలవాటు చేసుకోవాలని అన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ ఏసీపీ ని సన్మానించారు. వెల్నెస్ హాస్పిటల్స్ యాజమాన్యాన్నిఆయన అభినందించారు.