Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 1:47 pm Posted by : ramakrishna

ఏసీపీల బదిలీలు

 

. . . నిజామాబాద్ ఏసీపీగా ప్రకాష్ 

 

హైదరాబాద్, బతుకమ్మ  : 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీపీలు/డి.ఎస్.పి లను బదిలీ చేస్తూ డిజిపి శివధర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఈనెల 26న ఈ మేరకు ఉత్తర్వులు రాగా మంగళవారం ఆలస్యంగా విడుదల చేశారు. నిజామాబాద్ ఎసిపిగా పనిచేస్తున్న రాజా వెంకటరెడ్డిని హైదరాబాద్ డిజిపి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి బి ప్రకాష్ ను నిజామాబాద్ కు బదిలీ చేశారు. డి.ఎస్.పి ఇంటెలిజెన్స్ గా పనిచేస్తున్న వెంకన్న బాబును ఇల్లందు డీఎస్పీగా బదిలీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు డిఎస్పీగా పని చేస్తున్న సారంగపాణి ని ఖమ్మం జిల్లా వైరా ఏసిపిగా నియమించారు. జిహెచ్ఎంసి లో డీఎస్పీగా పనిచేస్తున్న పద్మనాభుల శ్రీనివాసును ఖాళీగా ఉన్న జిహెచ్ఎంసి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి కల్పించారు.