బతుకమ్మ, ఏర్గట్ల: ఆర్మూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె.వెంకటేశ్వర రెడ్డి ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టేషన్ సిబ్బందితో పరేడ్ నిర్వహించారు. స్టేషన్‌లో ఉన్న రికార్డులు,కేసు డైరీలు,నిత్య కార్యకలాపాల నమోదులు తదితరాలను పరిశీలించారు. నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలపై వివరణాత్మకంగా సిబ్బందికి సూచనలు మరియు మార్గదర్శకాలు అందించారు.శ్రద్ధతో విధులను నిర్వహించాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలన్నదితో పాటు,మండల పరిధిలోని గ్రామాల్లో నిఘా పెంచి నేరాల నివారణ కు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భీమ్ గల్ సిఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సై పి రాజేశ్వర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.